కావూరి నంగనాచి కబుర్లు
posted on Dec 7, 2013 @ 3:17PM
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు...పదివి రాకముందు అత్యుత్సాహంగా సమైక్యవాదిగా ప్రకటనలు గుప్పించి, పదివి దక్కిన మారుక్షణమే మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను ఇంకా వీర సమైక్యవాదినే అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. భద్రాచలం డివిజన్ ను ఆంద్రకు కలపాలని డిమాండ్ చేశామని, హైదరాబాద్ ను పదేళ్లపాటు కేంద్రపాలితం చేయాలని కోరినా ఒప్పుకోలేదని అంటున్నారు.
కర్నూలు,అనంతపురం జిల్లాలకు హైదరాబాద్ అందుబాటులో ఉంటుందని, వారికి ఉపయోగం ఉంటుందని రాయల తెలంగాణ ఇవ్వాలని కోరామని, దానిని ఒప్పుకోలేదని కావూరి చెప్పారు. ఈ నేపధ్యంలో తాను మంత్రివర్గం సమావేశం నుంచి బయటకు వచ్చానని ఆయన అన్నారు. అయితే విభజనకు ఒప్పుకుంటున్నాము కనుక ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని కావూరి తెలిపారు.
అంతా అయిపోయి సీమాంధ్రుల చేతుల్లో కేంద్రం, కాంగ్రెస్ పార్టీ చిప్ప పెట్టేసిన తరువాత కూడా ఇప్పుడు ఇంకా ఆ డిమాండ్ కు అర్థం వుందా!?