కేటీఆర్‌ని సీఎం చేస్తే ప్రగతిభవన్ ముందు ప్రాణం తీసుకుంటానన్న కవిత..!
posted on Aug 25, 2021 @ 6:24PM
కల్వకుంట్ల కుటుంబంలో ఫ్యామిలీ వార్. ఎప్పటి నుంచో జరుగుతోంది ప్రచారం. ఇది ప్రచారం కాదని.. అదంతా నిజమని ఈ రాఖీ పండుగతో తేలిపోయింది. ఏటేటా అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టే చెల్లి కవిత.. ఈసారి మాత్రం రాఖీ కట్టకుండా ముఖం చాటేసింది. ప్రగతిభవన్‌లో ఫ్యామిలీ గొడవలున్నాయనే వాదనకు ఓపెన్‌గా బలం చేకూరింది. కేటీఆర్, సంతోష్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. తనను అస్సలు పట్టించుకోవడం లేదనేది కవిత అక్కస్సు.
అంతేకాదు, కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ముఖ్యమంత్రి పీఠమే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందనే వారూ ఉన్నారు. ఇక, ఆస్తులన్నీ మీరే పోగేసుకుంటారా.. మాకేమీ ఛాన్స్ ఇవ్వరా అంటూ కూడా కవితమ్మ అలిగిందని కూడా అంటున్నారు. నిజమేంటో బయటి వారికి తెలీకున్నా.. కేసీఆర్ ఫ్యామిలీలో వార్ జరుగుతోందనే సంగతి మాత్రం రాఖీతో తేలిపోయింది. అన్న-చెల్లికి అస్సలు పడటం లేదని.. తండ్రి తనయుడికే సపోర్ట్ చేయడం ఇష్టం లేకనే కూతురు ప్రగతిభవన్‌లో అడుగుపెట్టలేదని అంటున్నారు.
కేటీఆర్-కవిత గొడవలపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. అందుకే ఆమె రాఖీ కట్టేందుకు కూడా రాలేదని అన్నారు. కేటీఆర్‌ని సీఎం చేస్తే ప్రగతి భవన్ ముందు ప్రాణం తీసుకుంటానని కవిత చెప్పిందంటూ ఎమ్మెల్యే సీతక్క చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ.. నిజమా? కవిత అంత మాటందా? కేటీఆర్‌ను సీఎం చేస్తే.. ప్రగతిభవన్ ముందు సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిందా? అంటూ ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు టీఆర్ఎస్ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. ఎప్పుడూ కాస్త మౌనంగా ఉండే సీతక్క.. ఇంతటి ఆరోపణ చేసిందంటే అందులో నిజం ఉండే ఉంటుందని అంటున్నారు.