ప్రియాంక సీక్రెట్ తెలియాలంటున్న కత్రినా..
posted on Feb 9, 2016 @ 3:47PM
సాధారణంగా ఒక హీరోయిన్ ను ఒక హీరోయిన్ పొగుడుకోవడం చాలా రేర్. అందులోనూ బాలీవుడ్ లో ఇది కొంచెం ఎక్కువ. అక్కడ హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ మాత్రమే కాదు.. కొంద మంది హీరోయిన్ల సంగతైతే.. పచ్చగడ్డి వేస్తేనే భగ్గమంటుందా అనే రేంజ్ లో కోల్డ్ వార్ జరుగతుంటుంది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా కత్రినా కైఫ్ మరో నటి ప్రియాంక చోప్రాని మాత్రం పొగిడేసింది. ఫితూర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రియాంక హాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రస్తావించింది. హాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల, ఏకాగ్రత కావాలని అవన్నీ ప్రియాంకలో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందని తెలిపింది. మరి ఇది విన్న ప్రియాంక కత్రినాకు తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెబుతుందో లేదో చూడాలి.