కశ్మీర్ ఉగ్రవాదులకు అన్నల మద్ధతు..
posted on Sep 19, 2016 @ 9:56AM
ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన మధ్య పోరాటాన్ని కొనసాగిస్తోన్న కశ్మీర్ వేర్పాటువాదులకు ఊహించని మద్ధతు లభించింది. ఆ మద్ధతు ఎవరిదో కాదు దేశ అంతర్గత భద్రతకు పెను సవాలుగా మారిన మావోయిస్టుల నుంచి వచ్చింది. కశ్మీర్ వేర్పాటు వాదులకు తాము పూర్తి మద్ధతు ఇస్తున్నట్టు ఆంధ్రా-ఒడిశా మావోయిస్టు కమిటీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. 70 వేల మంది యువకులను ప్రభుత్వం కిరాయి మూకలతో చంపించిందని..ఇంకా లెక్కలేనన్ని అత్యాచారాలు, ఘోరాలు జరుగుతున్నాయంటూ లేఖలో పేర్కొంది. ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రజల దృష్టి మరల్చేందుకు కశ్మీర్ సమస్యను తెరపైకి తీసుకొచ్చిందంటూ తీవ్రస్థాయిలో విమర్శించింది.