జైలులో కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
posted on Jul 16, 2024 @ 3:18PM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం (జులై 16న) ఆమె అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆమెను దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై గత నాలుగు నెలలుగా కవిత తీహార్ జైలులో ఉంటున్న సంగతి తెలసిందే.
ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించడంతో ఆమె ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిలు పిటిషన్ విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.