కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

సుప్రసిద్ధ దర్శకుడు,  కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ ఇక లేరు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంగా ఉన్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.  

శంకరాభరణం చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కే. విశ్వనాథ్ ఆ తరువాత సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం,  సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, శుభసంకల్పం వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఆయన సినిమాలలో సంగీత, సాహిత్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. కే.విశ్వనాథ్ కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే, 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాలు లభించాయి.  

Advertising
Advertising