బాబు దారిలోకి జూనియర్: ప్రమాణానికి హాజరు
posted on Jun 7, 2014 @ 4:15PM
ఎన్నికల సమయంలో మూతి ముడుచుకుని ప్రచారానికి కూడా రాకుండా బెట్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎందుకైనా మంచిదని చంద్రబాబు చెంతకు చేరుతున్నాడు. చంద్రబాబు గెలవగానే హరికృష్ణ దారిలోకి వచ్చాడు. చంద్రబాబు ఇంటికి వెళ్ళి అభినందించాడు. మహానాడులో కూడా చాలా బుద్ధిగా పాల్గొన్నాడు. అయితే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు కుటుంబ సమేతంగా విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంత ఊరైన నిమ్మకూరుకు వెళ్ళి వెళ్లి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఈ ఫ్యామిలీ హాజరవుతుంది.