జెపికి రాజమౌళి మద్దతు
posted on Sep 15, 2013 @ 8:33PM
ఈ జనరేషన్ సినీ ప్రముఖులు సినిమాలతో పాటు ఇతర విషయాల మీద కూడ తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. అలా సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించే అలవాటు ఉన్న టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ఇటీవల జేపి చేపట్టిన తెలుగుతేజం యాత్ర ఆగిపోవటం పై ఈ క్రియేటర్ స్పందిచారు.
గతంలో కూడా పలు సందర్భాల్లో జెపికి మద్దతు తెలిపిన రాజమౌళి ఆయన యాత్ర ఆగిపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా స్పందించిన ఆయన ప్రస్థుత పరిస్థితుల్లో జెపి ప్రజలకు మద్దతుగానే యాత్ర చేపట్టారన్న రాజమౌళి ఆయనపై దాడులు చేయటం తగదన్నారు.
గతంలో తెలంగాణ ఉద్యయం జరుగుతున్నపుడు జెపి ఇలాగే పర్యటించారని, ఇప్పుడు కూడా ఆయన ప్రజల తరుపునే ఉద్యమం చేస్తున్నారన్నారు. రాష్ట్రం కలిసున్నా విడిపోయినా ప్రజలు మాత్రం కలిసే ఉండాలన్నారు రాజమౌళి.