హరీశ్ రావు సవాల్ కు ప్రతి సవాల్..
posted on Nov 13, 2015 @ 5:12PM
వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో నేతలు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతలను విమర్శించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఉపఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచినట్టుయితే పీసీసీ పదవికి రాజీనామా చేస్తారా అని హరీశ్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి విసిరిన సవాల్ పై ఆయన స్పందించలేదు కాని.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాత్రం స్పందించారు. ఒకవేళ వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కనుక ఓడిపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రతిసవాల్ విసిరారు. రైతుల సమస్యల మీద కేసీఆర్ దృష్టి పెట్టాలని.. ఫామ్ హౌస్ ను విడిచిపెట్టి బయటకు రావాలంటూ మండిపడ్డారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. హరీశ్ రావు సవాల్ విసిరితే.. ఆయనకు కాకుండా కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ కేసీఆర్ ను సీన్ లోకి తీసుకురావడం గమనార్హం.