'కాంగ్రెస్' గోవిందా..గోవింద
posted on Dec 10, 2013 @ 10:59AM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పార్టీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, గోవిందా..గోవింద అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవవికి రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉందని, తెలంగాణ బిల్లు ఆగిపోయే అవకాశాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సోనియా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. రాహుల్ కానీ, ప్రియాంక కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారుతుందని తాను చెప్పలేనని, అయితే పార్టీకి కొత్త నాయకత్వం రావాలన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావలసిన అవసరం ఉందని, కొత్త పార్టీ రాకపోతే ఇపడు కాంగ్రెస్‌లో ఉన్న వారు ఎక్కడిపోతారని ప్రశ్నించారు.