సర్జికల్ దాడుల సాక్ష్యాలు బయటపెట్టాల్సిందే...
posted on Oct 7, 2016 @ 6:04PM
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పారు. ఇప్పటికే భారత్-పాక్ పై చేసిన సర్జికల్ దాడులకు సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో దివాకర్ రెడ్డి కూడా చేరిపోయారు. సర్జికల్ దాడుల గురించిన సాక్ష్యాలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదని మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలపై స్పందించిన దివాకర్ రెడ్డి.. భారత సైన్యం చేసిన దాడులకు సంబంధించిన వీడియో పుటేజీని విడుదల చేయాల్సిందేనని అన్నారు. భద్రతా కారణాలు, రహస్య విషయాలు అంటున్నారు.. అలాంటప్పుడు ఆ వీడియోను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మాత్రమే చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే లక్షిత దాడులు చేశామని చెప్పుకుంటున్న ఆంశాన్ని బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే అనుకోవాల్సి వస్తుందని అన్నారు.