అమ్మ బుగ్గపై రంధ్రాల మిస్టరీ...!
posted on Dec 8, 2016 @ 10:59AM
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు నెలల పైననే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడారు. ఎంతో అత్యాధునిక చికిత్స అందించినా కూడా ఆమె ఆరోగ్యం మాత్రం నయం కాలేకపోయింది. దీంతో ఆమె సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆతరువాత మెరీనా బీచ్ లో ఎంజీఆర్ ఘాట్ పక్కనే ఆమె పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... జయలలిత బుగ్గపై రంధ్రాలు ఉండటం.. ఇప్పుడు దానికి సంబంధించిన ఓ ఫొటో చక్కర్లు కొడుతుంది. ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఉండటంతో.. చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఆమె మృతదేహాం కొన్ని రోజులు పాడవకుండా శరీరంలోకి రసాయనాలు ఎక్కించి ఉంటారా... అందులో భాగంగానే ఈ రంధ్రాలు ఏర్పడ్డాయా అని అనుకుంటున్నారు. సాధారణంగా ఈ పద్దతిని ‘ఎమాల్మింగ్’ అంటారు.
‘ఎమాల్మింగ్’ అంటే ఏమిటి..?
‘ఎమాల్మింగ్’ అంటే దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు, బాడీలోకి దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపడమే ‘ఎమాల్మింగ్’. అయితే సహజంగా ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు. జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి.
అయితే జయలలితకు ఆఖరి అస్త్రంగా ఎక్మో ద్వారా చికిత్స చేశారు కాబట్టి ఆ ప్రక్రియలోనే ఎమాల్మింగ్ కూడా నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అని కూడా అనుకుంటున్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో అమ్మ బుగ్గపై రంధ్రాలు ఉండటంతో ఇది కాస్త హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇంతకీ ఆ రంధ్రాలు ఎందుకు పెట్టారో వైద్యులకే తెలియాలి