రాందాస్ సొరేన్ ఆరోగ్య పరిస్ఖితి ఆందోళనకరం
posted on Aug 2, 2025 @ 2:25PM
ఝార్ఖండ్ మంత్రి రాందాస్ సొరేన్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (ఆగస్టు 2) తెల్లవారు జామున ఆయన జంషెడ్ పూర్ లోని తన నవాసంలో బాత్రూమ్ లో జారి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. మెదడులో రక్తం గడ్డకట్టిందని చెబుతున్నారు.
రాందాస్ సొరేన్ ను తొలుత జంషెడ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సైచనమూరకు మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నాయకుడైన రాందాస్ సొరేన్ ఘట్‌షిలా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో విద్యా, సాక్షరత, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2024లో ఆయనకు ముఖ్యమంత్రి మరో రెండు కీలక శాఖలు రెవెన్యూ, రవాణా కూడా అప్పగించారు.