మరి కొద్దిసేపటిలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
posted on Nov 12, 2015 8:36AM
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆయన క్యాంప్ కార్యాలయంలో ఇవ్వాళ ఉదయం 11 గంటలకు భేటీ కాబోతున్నారు. కోద్దె సేపటి క్రితమే పవన్ కళ్యాణ్, మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. రాజధాని భూసేకరణ, అమరావతి నిర్మాణం, ప్రత్యేకహోదా, ప్యాకేజీ తదితర విషయాల గురించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కి ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి గన్నవరం విమానాశ్రయంలో ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. గన్నవరం నుండి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం చేరుకొంటారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న కొందరు రైతులు కూడా విమానశ్రయం వద్ద పవన్ కళ్యాణ్ న్ని కలుసుకొనేందుకు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కలుసుకొనే ముందే ఆయనతో తామెదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి, ముఖ్యమంత్రితో సమావేశమయినప్పుడు వాటి గురించి చర్చించి పరిష్కరించాలని వారు కోరుకొంటున్నారు.