టీడీపీ-బీజేపీకి దూరంగా పవన్ కళ్యాణ్.. సీపీఐకు దగ్గరగా..
posted on Dec 2, 2016 @ 10:00AM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు పలికి ఎన్నికల్లో వారు విజయం సాధించడానికి కారణమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీ పార్టీలకు దూరంగా ఉంటున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీలపైనా విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడ్డారు ఆయన. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని.. కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడిది ఇంకా పార్టీ నేతలదే అని చెప్పారు కూడా. అంతేకాదు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది అని కూడా హెచ్చరించారు. ఇక ఎట్లాగూ 2019 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనాలని చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలో దిగుదామని చూస్తున్నారు. కానీ నిన్న పవన్ కల్యాణ్ సీపీఐ నేతలతో భేటీ అయిన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పెద్దనోట్ల రద్దు సహా ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రావు తదితరులు పవన్‌తో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఇక సీపీఐ నేతలతో భేటీ అనంతరం పవన్ బీజేపీ-టీడీపీ పార్టీలకు దూరంగా ఉంటున్నారు అన్న వార్తలకు ఆజ్యం పోసినట్టైంది. పవన్ సీపీఐతో జతకడతారు అన్న వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం.. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతారో.. లేక వేరే పార్టీలతో పొత్తుతో బరిలోకి దిగుతారో..?