కాంగ్రెస్ కు షాక్.. జానారెడ్డి రాజీనామా.. అందుకేనా..?
posted on Jun 15, 2016 @ 10:06AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు నేతలు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే వినోద్ టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారికి తోటు మరో నేత కూడా గులాబి కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాడు. నల్గొండ డీసీసీ చీఫ్ రాంరెడ్డి కూడా కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు చెప్పారు.
అయితే ఇప్పటికే వరుస జంపింగ్ లతో దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్న కాంగ్రెస్ కు జానారెడ్డి మరో షాక్ ఇచ్చారు. నిజంగా వరుస పార్టీ ఫిరాయింపులతో ఆయన విసుగెత్తి పోయారో లేక ఇంకా ఏదైనా ఉందో తెలియదు కాని ఆయన కూడా తన పదవులకు రాజీనామా చేస్తానని చెప్పి షాకిచ్చాడు. దీంతో ఇప్పుడు ఇది చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ నేతల ఫిరాయింపులపై మాట్లాడిన జానారెడ్డి సీఎల్పీతో పాటు మిగతా అన్ని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు తన రాజీనామా వెనుక కారణం కూడా వివరించాడు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు లోను చేశాయని.. ఫిరాయింపుల నేపథ్యంలో ఈ పదవుల్లో కొనసాగడం అవసరమా..?, ఎందుకు నాకీ పదవులు..? అనిపించినందువల్లే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పదవులన్నింటిని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు. రాజీనామాపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చించాక వెల్లడిస్తామని ప్రకటించారు. మరి నిజంగానే జానారెడ్డి చెప్పింది నిజమేనా.. లేకపోతే తరువాత ఏదైన ట్విస్ట్ ఇస్తారా.. చూడాలి మరి.