వెలగపూడి సభలో జగన్ కు ఊహించని షాక్
posted on May 26, 2023 @ 12:18PM
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి సభల నుంచి జనం జారుకోవడం సాధారణమైపోయింది. ఆయన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడానికి ఏర్పాటు చేసిన సభల నంచి జనం గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
అయితే వెలగపూడి సభ మాత్రం వాటికి డిఫరెంట్.. ఇక్కడ ఆయన పేదల పెన్నిధిగా మారి పేదలకు సెంటు భూమి పట్టాలు ప్రదానం చేస్తున్నారు. ఇందు కోసం భారీ ఎర్పాట్లతో బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున జనాలను తరలించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల నిరసనలను అణచివేసి.. వారి గళం వినిపించకుండా పోలీసులను రైతుల దీక్షా శిబిరాల వద్ద మోహరించారు. ఇక సభకు తీసుకువచ్చిన వారంతా సెంటు భూమి లబ్ధిదారులే. అయినా సరే జగన్ పట్టాల పంపిణీ సభలో ప్రసగం ప్రారంభించగానే జనం పారిపోవడం ప్రారంభించారు.
వారిని ఆపడానికి వైసీపీ శ్రేణులు, పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జనం కోసం పట్టాల పంపిణీ అంటూ ఏర్పాటు చేసిన సభ నుంచి ఆ జనాలే వెళ్లిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం వ్యక్తమౌతోంది. గడపగడపకూ కార్యక్రమంలో కూడా జనం ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తే అక్కడికక్కడే వారి పథకాలు కట్ చేయమన్న ఆదేశాలు జారీ అవుతున్నాయి.
మరి జగన్ సభను జనం బాయ్ కాట్ చేశారు కనుక అలా సభ నుంచి వెళ్లి పోయిన వారికి సెంటు భూమి పట్టాలు ఆపేస్తారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ధైర్యం జగన్ చేయగలరా అని కూడా సవాళ్లు ఎదురౌతున్నాయి.