ఇరకాటంలో జానారెడ్డి?
posted on Aug 6, 2012 @ 5:14PM
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి జానారెడ్డి ఓ పెద్ద ఇరకాటంలో పడ్డారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఈయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో తన పట్టుపెంచుకోవాలని పిలిచినా, పిలవకపోయినా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇలానే ఎంపి వివేకానంద పిలిచాడు కదా అని తెలంగాణా ఎన్జీఓ సంఘ మాజీ అథ్యక్షుడు స్వామిగౌడ్ సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొంటూనే మంత్రి ముందస్తు జాగ్రత్త పాటించినట్లుంటుందని ఎవరూ కూడా ఇతర అంశాలు ఎత్తకుండా స్వామిగౌడ్‌ను అభినందించాలని కోరరారు.
దీంతో అప్పటివరకూ మౌనంగా ఉన్న టిఎన్జీఓ నేతలు మంత్రి వ్యాఖ్యానాలపై మండిపడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి హతాశుడయ్యారు. ఆ తరువాత తనను ఎంపి వివేకానంద పిలిచారని తెలిపారు. అలాగే తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి అరెస్టు అయినవారందరినీ విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. అసలు మంత్రులకు ఆహ్వానం లేదని టిఎన్జీఓ నేతలు హెచ్చరించటంతో మంత్రి తాను ఆత్మశుద్ధితో ప్రవర్తిస్తున్నానని, తాను ఎటువంటి మంత్రి హోదాతోనూ రాలేదని, తెలంగాణా కసమే తాను వచ్చానని ఈ విషయం తన అంతరాత్మకు తెలుసని మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. మొత్తం మీద సమావేశంలో మంత్రి జానారెడ్డి తనకు ఒకవేల ముఖ్యమంత్రి హోదా వచ్చినా వదిలేయాలని ఆ సమావేశంలో నేతలు డిమాండు చేశారు.