జైపాల్‌రెడ్డిని లొంగదీసిన కిరణ్?
posted on Aug 8, 2012 8:50AM
రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మహారాష్ట్రకు సహకరించిన కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్‌రెడ్డిని సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రధాని సహాయంతో లొంగదీశారు. దీంతో కేజీబేసిన్ గ్యాస్‌లో మహారాష్ట్రకు కేంద్రం వేసిన వాటా ఆగిపోయింది. అంటే విద్యుత్తుఉత్పత్తికి కేజీ బేసిన్ నుంచి విడుదల చేసే 3.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్ యథాతథంగా మన రాష్ట్ర అవసరాలకు వాడుకోవచ్చు. ఒకరకంగా ప్రధాని జోక్యం వల్లే ఈ గ్యాస్ సరఫరా విషయంలో జైపాల్‌రెడ్డికి చుక్కెదురైంది. ఈయన్ని కేవలం పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణ మినహా ఇంకెవరూ సమర్థించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట వినే ప్రసక్తే కేంద్ర నాయకత్వానికి ఉండదని బొత్సా భావించారు.
దీనికి భిన్నంగా కిరణ్ సమస్యను ఎత్తిచూపటంలో సఫల మయ్యారు. ఆయన ప్రధానితో పాటు వీరప్పమొయిలీ, ఎఐసిసి అథ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలిశారు. వీరిద్దరితోనూ తాను ఎందుకు ఢల్లీి రావాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతూ పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును వారికి అర్థమయ్యేలా విశదీకరించారు. ఒక కేంద్రమంత్రి హోదాలో ఉండికూడా జైపాల్‌రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయం వారిని కదిలించింది. దీంతో వారు కేంద్ర ప్రభుత్వం పరంగా ఎదురయ్యే సవాళ్లు తరువాత చూసుకోవచ్చు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్య పరిష్కరించాలని ఓ నిర్ణయానికి వచ్చి గ్యాస్‌సరఫరా యథాతథంగా ఉంచాలని ఆదేశించారు. దీంతో జైపాల్‌రెడ్డి హైకమాండ్ ఆదేశాల మేరకు కేజీబేసిన్‌గ్యాస్ యథాతథంగా రాష్ట్రానికి అందిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ జైపాల్‌రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తూ వచ్చిన గౌరవం ఒకరకంగా దెబ్బతిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకదశలో జైపాల్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంత అర్హత ఉన్న వ్యక్తిగా భావించిన కాంగ్రెస్ అథిష్టానం ఆయనపై ఉంచిన నమ్మకం మార్చుకుంది. అలానే విద్యుత్తు సమస్యతో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రధాని ముందుంచటంలో కిరణ్ కూడా ప్రత్యేకమైనశైలిని ప్రదర్శించారు. తనతో పాటు వచ్చిన మిగిలిన సభ్యులతోనూ సమస్య తీవ్రతను చెప్పించటంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.