జగ్గారెడ్డి దీక్ష.. అరెస్ట్ చేసిన పోలీసులు
posted on Aug 10, 2016 @ 11:37AM
తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించాలని భావిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దీక్షకు పూనుకున్నారు. తన ప్రాణం పోయినా దీక్ష నిర్వహించే తీరుతానని.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేసేవరకూ తన పోరాటం సాగుతోందని అన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం మల్లన్న సాగర్ నుంచే బీజం పడిందని తెలిపారు. భారీ అనుచరగణంతో దీక్షా స్థలికి చేరుకొని దీక్షకు దిగారు. అయితే దీక్షకు తాము అనుమతి ఇవ్వలేదని చెప్పిన పోలీసులు జగ్గారెడ్డి దీక్షను అనుమతించబోమని చెప్పారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.