జగన్ కి జైలే...మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ
posted on Sep 12, 2022 @ 12:11PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి రైతాంగం ఉద్యమబాట చేపట్టారు. అది ఇప్పటికి వెయ్యిరోజులు పూర్తిచేసుకుంది. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ప్రభు త్వం కావాలనే ఉల్లంఘించి, మూడు రాజధానుల ఆలోచనను తెరమీదకి తెచ్చింది. దీని పై ప్రజలు, రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకీ వెళ్లకుండా ఊరుకున్న జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును కాదనడంలో ప్రజల్ని, రైతాంగానని మోసం చేస్తోందన్న భావన సర్వత్రా ఏర్పడింది. తాజాగా మాజీ న్యాయమూర్తి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా జగన్ సర్కార్ తిక్క ఆలోచనలు, వ్యవ హారశైలికి విసిగెత్తి జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
మూడు రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ ఆ తీర్పును ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, సంబంధిత మంత్రి ని, సీఎస్‌లకు జైలు శిక్ష విధించాలని విశ్రాంత న్యాయమూర్తి వి.గోపాల గౌడ అన్నారు. తానే గనుక ఆ కేసును విచారిస్తుంటే సీఎం జగన్‌ను జైలుకు పంపేవాడినని గోపాల గౌడ అన్నారు.
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమరావతే ఏపీ రాజధాని అని, ఈ విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం తప్ప ఏపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం అన్నారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్ర యించలేదు గనుక హైకోర్టు తీర్పే శిరోధార్యమవుతుందన్నారు. మూడు రాజధానులని సీఎం, మంత్రులు అంటున్నారు గాని దానికి చట్ట బద్ధత ఉండదని సుబ్రహ్మణ్యం అన్నారు.
రాజధాని నిర్మాణానికి భూసమీకరణ నుంచీ ప్రణాళిక రూప కల్ప న వరకూ సుబ్రహ్మణ్యం పరిశీలించారు. అలాంటి సుబ్రహ్మణ్యం జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం గమనార్హం. ప్రభుత్వ వాదన లన్నీ విన్న తర్వాతే కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు అర్ధంకాదని అనడం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించ లేదనే అర్ధాన్ని సూచిస్తుందన్నారు. సీఎం, మంత్రులు తాము చెప్పిందే అమలు చేస్తామనడం హేయ మన్నారు.