విప్‌లు స్పీకర్ ముందు ..వేటు ప్రకటనపైనే ఆసక్తి
posted on Jan 30, 2012 @ 10:21AM
హైదరాబాద్: తాము విచారణకు హాజరయ్యేది లేదని జగన్ వర్గం తెగేసి చెప్పడంతో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకుంటారా అనే దానిఫై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాదెండ్ల ముందు ఇవాళ విప్‌లు కొండ్రు మురళి, వంగా గీత హాజరుకానున్నారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ఆలోపే జగన్ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. పార్టీ విప్ ధిక్కరించి స్పీకర్ ముందు హాజరుకాబోమని తెగేసి చెప్పడంతో బంతి నాదెండ్ల కోర్ట్‌లో పడింది. ఆయన తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనర్హతపై ఫిబ్రవరి మెదటి వారంలోనే తుది నిర్ణయం తీసుకోవాలని మనోహర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హతపై ప్రభుత్వ విప్ కొండ్రు మురళి, పిఆర్పీ విప్ వంగా గీత ఇవాళ వాదనలు వినిపించనున్నారు. అడ్వకేట్స్‌తో సహా వెళ్లాలని నిర్ణయించారు. విప్‌ల సమావేశంలోనే వేటుపై స్పీకర్ ఓ నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు. అయితే ఎప్పుడు ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.