సా.....గుతున్న అక్రమాస్తుల కేసు

  

 

 

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జీడిపాకంలా సాగుతోంది. జగన్ మీద కొత్త కొత్త చార్జ్ ల్ని పెట్టేందుకు సిబిఐ తెగ శోధిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా మీదపడుతున్న కేసుల భారం జగన్ ని బాగా కుంగదీస్తున్నా.. ఇప్పటివరకూ గట్టిగానే ఉన్నట్టు లెక్క.

  

చంచల్ గూడ జైలునుంచే జగన్ తన కార్యకలాపాల్ని నడుపుతున్నారని టిడిపి నేతలు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికీ అన్నీ జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయంటున్నారు. జనంలో అన్నకి మద్దతుని కూడగట్టేందుకు తల్లీ, చెల్లీ కఠోరమైన శ్రమని ఎదుర్కోవాల్సొస్తోంది.

 

అక్రమాస్తుల కేసు విచారణ నత్తనడకన సాగుతోంది. అధికారులు విదేశాలనుంచి సమాచారాన్ని సేకరించే పనిలోపడ్డారు. జగన్ కేసు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నలుగుతోంది. తమపై ఎలాంటి ఒత్తిళ్లూ పనిచేయడం లేదని, పూర్తిగా పారదర్శకంగా విచారణ జరుపుతున్నామనీ సిబిఐ డైరెక్టర్ ఎ.పి.సింగ్ తెలిపారు.

  

టిడిపినేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంచల్ గూడ జైలుకెళ్లి జగన్ ని కలిసి మాట్లాడారు. ఉమ్మారెడ్డి టిడిపిని విడిచిపెట్టి జగన్ పార్టీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నేత వడ్డెపల్లి నర్సింగరావ్ కూడా జగన్ ని కలిశారు. ఎమర్జెన్సీ అలారం మోగడంతో అధికారులు సోమవారం ములాఖత్ లను నిలిపేశారు.