ఎన్టీఆర్ ఫోటోతో వైకాపాకి సంబంధం లేదు
posted on Apr 7, 2013 @ 4:59PM
వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ టిడిపిల మధ్య ఫ్లెక్సీ ల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ కూడా స్పందించారు. ఆ పార్టీ నేతల ఫోటోలు బ్యానర్లలో పెట్టుకొంటే ఓట్లు రాలవనే ఆలోచనతోనే వారు ఎన్టీఆర్ ఫోటోలు వాడుకొంటున్నట్లున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జూ.ఎన్టీఆర్ వెంటనే ఖండించాలని అన్నారు.
ఈ వివాదం పై జూ.ఎన్టీఆర్ స్పందించలేదు, కాని జగన్ పార్టీ మాత్రం స్పందించింది. ఈ వివాదం పై వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత కొణతల రామకృష్ణ మాట్లాడుతూ..స్వర్గీయ ఎన్టీఆర్ గారికి చాలా మంది అభిమానులున్నారని, అలాంటి వారిలో కొంతమంది తమ పార్టీలోవున్నారని, వారెవరైనా ఫోటో పెట్టుకుంటే అది తమ సంబందించిన విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
కొడాలి నాని ఎన్టీఆర్ అభిమాని అని, ఆయనపై అభిమానంతో ఎవరైనా ఫ్లెక్సీ లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టి వుంటారన్నారు. ఎన్టీఆర్ ఫోటోతో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని రామకృష్ణ స్పష్టం చేశారు.