Read more!

జలగన్నకి జలగ లేఖ!

నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను. నేను రక్తం పీల్చడానికి ట్రై చేస్తున్నప్పుడు అంత టాలెంటెడ్‌గా పీల్చలేకపోతున్నాను. దాంతో మా పెద్దలందరూ నా మీద చాలా సీరియస్ అవుతున్నారు. జలగ పుటక పుట్టి జలగలాగా రక్తం పీల్చలేకపోవడం దారుణమని అన్నారు. మనిషిలాగా పుట్టి జలగలా జనం రక్తం పీలుస్తున్న నీ దగ్గర్నుంచి మన జలగ జాతి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయని చెప్పారు. నువ్వు జనం రక్తం ఎలా పీల్చావో మా పెద్దలు వివరిస్తుంటే విని, నాకు జలగ జన్మ మీదే విరక్తి కలిగింది. నువ్వు ఇంత బాగా జనం రక్తం పీల్చుతున్నావు కాబట్టే నిన్ను అందరూ ప్రేమగా ‘జలగన్నా’ అని పిలుస్తున్నారని అర్థమైంది. నువ్వు జనం నుంచి ఏయే పద్ధతుల ద్వారా వాళ్ళ రక్తం పీల్చావో మా పెద్దలు చెబుతుంటే, నాకు లీటర్ రక్తం ఒకేసారి తాగినంత ఆనందం కలిగింది. నీ రక్తం పీల్చుడు చరిత్రని మావాళ్ళు చెప్తే విని తరించాను. అవి నేను మరోసారి నీముందు ప్రస్తావించి తరించాలని అనుకుంటున్నాను.

-- ‘రక్తం’తో లింకు వున్న రెండు సంఘటనలను క్రియేట్ చేయడం ద్వారా లాస్ట్ టైమ్ నువ్వు అధికారంలోకి వచ్చావంటగా.
-- వచ్చీరాగానే రాజధాని రైతుల రక్తాన్ని పీల్చావంటగా.
-- ఐదేళ్ళపాటు దిక్కుమాలిన మద్యంతో జనం రక్తాన్ని జుర్రేశావంటగా.
-- రోడ్లు వేయకుండా జనాన్ని హింసించింది, ఆ రోడ్ల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నీ రక్త దాహాన్ని తీర్చుకున్నావంటగా.
-- వందలాది మంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం నీ రక్తదాహమేనంటగా.
-- పారిశ్రామికవేత్తల రక్తాన్నీ పీల్చి వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశావంటగా.
-- పన్నులతో, ఛార్జీల పెంపుతో, అవినీతి, అక్రమాలతో జనం రక్తాన్ని స్ట్రా వేసి లాగేశావంటగా.
-- ఇసుక, గనులు, కొండలు... ఇలాంటి ప్రకృతి వనరులని పీల్చి పిప్పిచేశావంటగా.
-- భారీ సంఖ్యలో దాడులు, రక్తపాతాలతో నీ రుధిరదాహం తీర్చుకున్నావంటగా.
-- లక్షల కోట్లు అప్పులు చేసి, జనాన్ని రుణగ్రస్థుల్ని చేసి, తరతరాల ప్రజల రక్తాన్ని ఎలా స్వాహా చేశావో తెలిసింది.

.... ఇలా చెప్పుకుంటూ వెళ్తే ‘జలగన్న’ రక్త చరిత్రలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో హైలైట్స్ తెలుసుకుని తరించాను. నీ దగ్గరకి వచ్చి రక్తం పీల్చడం ఎలా అనే పాఠాలు నేర్చుకోవాలని నాక్కూడా వుందిగానీ, నువ్వు నా రక్తాన్ని కూడా పీల్చేస్తావని భయపడి నీ దగ్గరకి రావడం లేదు.. బైబై జలగన్నా.