సానుభూతి కరిగిపోతోందా?
posted on Jun 6, 2012 @ 3:54PM
"జగన్ ను అక్రమంగా అరెస్టు చేశారు" అనే ప్రచారం ద్వారా సానుభూతి పొందాలనే వైకాపా నేతల ఆశ క్రమంగా కరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. జగన్ ఆస్తులకు అక్రమంగా సంపాదించిన విధానం చాలా మంది సామాన్యులకు అర్థం కాలేదు. అవినీతిపై విస్తృతంగా ప్రచారం జరగడం, మీడియాలో వివరంగా జగన్ అక్రమాలపై ప్రచారం జరగడం వల్ల క్రమంగా జగన్ అక్రమాలు సామాన్యులకు కూడా అర్థం అవుతున్నాయి. దీనికి తోడు న్యాయస్థానాలు బెయిల్ తిరస్కరించడం, గాలి జనార్ధనరెడ్డి బెయిల్ నిమిత్తం కూడా కోట్ల రూపాయలు ఖర్చుచేయడం వంటి అంశాలు ప్రజలలో జగన్ పట్ల వున్న సానుభూతి క్రమంగా తగ్గిపోతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ కు బెయిల్ రావాలని కోరుకునేవారి కంటే నేడు ఆమాట స్థానంలో జగన్ కు బెయిల్ వస్తుందా? ఎంతకాలం జైలులో వుంటారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త సత్యం రామలింగరాజు ఏడాదిన్నర పైగా జైలులో వుండగా, కేంద్రమాజీ మంత్రి రాజా 11నెలల పాటు జైలులో వున్నారు. కనిమోళి 9 నెలల పాటు ఉన్నారు. ఈ స్థితిలో జగన్ ఎంతకాలం వుంటారు అనే అంశంపైచర్చ జరుగుతోంది.