డిప్రెషన్‌లో వి.ఐ.పి.ఖైదీలు
posted on Aug 2, 2012 @ 2:04PM
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వివిఐపిలు జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, సీనియర్ ఐఎఎస్ సుబ్రమణ్యం, మంత్రి మోపిదేవి సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, తదితరులంతా చర్లపల్లి జైలులో దాదాపు మూడు నెలలుగా మగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు జైలులో ప్రశాంతంగా గడుపుతున్నారా అంటే అది కూడా లేదని తెలిసింది ఆ మద్య చెట్ల కింద రమ్మీ ఆడుతున్నారని, ప్రత్యేక సదుపాయాలున్నందున వారికేమీ డోకాలేదని అందరూ అనుకున్నారు కాని అక్కడ పరిస్థితి వేరే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే వారు ఒక్కొక్కరూ మూడు కేజీలవరకు తగ్గారని, విచారవధనాలతో కనిపిస్తున్నారని తెలిసింది.కాలక్షేపం కోసం ఎన్ని గేమ్స్ ఆడినా మనస్సుని కంట్రోల్ లో పెట్టుకునేందుకు మెడిటేషన్ చేస్తున్నా ఎందుకిలా జరుగుతుందనుకుంటున్నారు. హోమ్ సికనెస్ కారణమని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంత విఐపి ట్రీట్‌మెంట్ ఉన్నా జైలు వాతావరణానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని, దానికి ఉదాహరణ సత్యం రామలింగరాజే నని సైకాలజీ నిపుణులు విశ్లేశిస్తున్నారు. జైలు జీవితంతో రామలింగరాజు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. దాని నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. ఇదే పరిస్ధితి జగన్ తోపాటు మిగిలిన వి.ఐ.పి. ఖైదీలకు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని సైకాలిస్టులు చెబుతున్నారు.