చిరంజీవికి ఇంటర్యూ ఇవ్వని సోనియా
posted on Aug 2, 2012 @ 1:48PM
రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఢల్లీిలో నిరాశ ఎదురైంది. సోనియాను వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న చిరు ప్రయత్నం బెడిసికొట్టింది. తన కేంద్ర మంత్రి పదవిపై మాట్లాడేందుకు సమయం ఇవ్వ వలసిందిగా ఆయన సోనియా కార్యాలయాన్ని సంప్రదించగా మరో 15 రోస్త్రల వరకూ వెయిట్ చేయాలని సమాధానం వచ్చింది.దీంతో చిరంజీవికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గుతుందన్న ఉహాగానాలు చెలరేగాయి.
తనకు మంత్రిపదవి ఇవ్వకుండా అవసరానికి ఉపయోగించుకొని వదిలేశారని, చిరంజీవి తన అనునాయుల దగ్గర వాపోతున్నట్లు తెలిసింది.కీలక సమయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకున్నందుకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, పార్టీ విలీన సమయంలో జరిగిన ఒప్పందాలను మర్చిపోయారని చిరంజీవి భావిస్తున్నారు.
అయితే కేంద్రంలో ఇంకా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నందున ఇకముందైనా తనను మంత్రిని చేయక పోతారా అన్న ఆశతో ఆయన ఉన్నట్లు తెలిసింది. కేంద్రం ఇటీవల క్యాబినెట్‌లో మంత్రిపదవులను సర్ధుబాటు చేసింది తప్ప పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చేయకపోవడం గమనార్హం.
చిరంజీవి సంతోషపడే విషయం ఏమంటే రెండు నెలలు క్రిందట చెన్నయ్‌లో తన పెద్దకుమార్తె ఇంటి వద్ద ఆదాయ పన్ను అధికారులు స్వాధీన పర్చుకున్న 35 కోట్ల రూపాయలకు టాక్సు కట్టించుకొని నల్ల డబ్బుని తెల్లడబ్బుగా మార్చి చిరంజీవికి అప్పగించినట్లు తెలిసింది. అది చిరంజీవి డబ్బే అని దానిని తన కుమార్తె దగ్గర దాచివుంచారని అప్పట్లోనే మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మంత్రిపదవి రాకపోయినా డిల్లీతో ఉన్న సంబందాలు తన డబ్బును వెనక్కి తెచ్చుకోవడంతో ఉపయోగ పడినందుకు చిరంజీవికి ఆనందమే కదా!