జగన్‌పై జోరు పెంచిన జైలు అధికారులు
posted on Jun 30, 2012 9:19AM
జగన్ బెయిల్‌పై గురువారం సిబిఐకి, జగన్ న్యాయవాదులకు మద్య సీబీఐ కోర్టులో జరిగిన వాదనల తర్వాత జగన్‌తరపు న్యాయవాది రాంజెఠ్మలానీ జగన్‌ను చంచల్‌గూడా జైలులో కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్‌కు కనీస సదుపాయాలు కల్పించటంలో జైలు అధికారులు విఫలమవుతున్నారన్నారు. తన క్లయింటు రాజకీయ నాయకుడని అతనికి మరింత స్వేచ్చనివ్వాలని, అండర్ ట్రయిల్ ఖైదీలకు కొన్ని సదుపాయాలను రాజ్యాంగం కల్పించిందని ఆయన అన్నారు. అవి జైలు అధికారులు కాలరాస్తున్నారని అందుకు నిదర్శనంగా జగన్‌కలిసేందుకు రాష్ట్రపతి అభ్యర్దిగా రేసులో ఉన్న పిఎ సంగ్మా, జగన్ బాబాయి వివేకానందలకు జైలు అధికారులు అనుమతించని విషయాన్ని రాంజెఠ్మలానీ గుర్తుచేశారు. మొదట వారానికి మూడు ములాఖత్‌లకు ఒప్పుకున్న జైలు అధికారులు సాక్షీ మీడియా సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అధికారిక సెల్‌ఫోన్ నుండి వెళ్లిన కాల్‌లిస్టు బహిర్గతం చేసిన తర్వాత జగన్‌కు వారానికి రెండు మిలాఖత్‌లు మాత్రమే మంజూరు చేయటం గమనించాల్సిన విషయం.శుక్రవారం ములాఖత్ సందర్భంగా జగన్ కుటుంబ సభ్యులు కలిశారు. జైల్లో జగన్ ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉన్నారని తెలిసింది.