జగన్ మద్దతు ప్రణబ్ కేనా ?
posted on Jun 30, 2012 9:23AM
రాష్ట్రపతి ఎన్నికలో వై.ఎస్.ఆర్ .కాంగ్రెస్ పార్టీ శానన సభ్యులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు యు.పి.ఎ. అభ్యర్ది ప్రణబ్ కుమార్ ముఖర్జీ కే మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. నిజానికి వీరు ప్రణబ్ కు మద్దతు ఇవ్వకపోయినా ఆయన గెలవడం ఖాయం. అయితే అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించాలన్న ఉద్దేశ్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. దీనిలో భాగంగానే ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చంచల్ గూడా జైలులో ఉన్న జగన్‌ను కలిసి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వాలని కోరారు. మతతత్వ పార్టీ అయిన బి.జె.పి. మద్దతుతో పోటీ చేస్తున్న సగ్మాకుకి ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఇది జరిగిన కొద్ది రోజులకు సంగ్మా చంచల్ గూడా జైలులో ఉన్న జగన్‌కు కలిసి మద్దకు కోరడానికి ప్రయత్నించారు. అయితే జగన్‌కు కలుసుకునేందుకు జైలు అధికారులు అంగీకరించకపోవడంతో ఆయన విజయమ్మను కలిసి మద్దతు కోరారు. పార్టీనాయకులతో కలిసి తమ నిర్ణయం తెలియజేస్తామని ఆమె చెప్పారు. కాని జగన్ మాత్రం గత్యంతరం లేని పరిస్ధితుత్లో యు.పి.ఎ. అభ్యర్ది ప్రణబ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో యుపిఎ అభ్యర్దికి మద్దతు ఇవ్వకపోతే సి.బి.ఐ కేసుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన భయపడుతున్నట్లు తెలిసింది. బెయిల్‌పై బైట పడేదాకా జాగ్రత్తగా ఉండాలని, అసదుద్దీన్ ఒవైసీ కోరినట్లు గానే ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది.