ఈడికి జగన్ భయపడుతున్నారా
posted on Jul 3, 2012 @ 12:25PM
ఇప్పటి దాకా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఎవరికీ, ఏ విచారణ సంస్థకు భయపడలేదు. ప్రత్యేకించి తనను అరెస్టు చేసిన సిబిఐకు ఆయన కనీసం జంకినట్లుగా కూడా కనిపించలేదు. అయితే సిబిఐ నుంచి పూర్తి వివరాలు, కేసు షీట్లను, ఆధారాలను తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాను సొంతంగా ఢల్లీి నుంచి అధికారులను హైదరాబాద్ పంపించింది. వీరు వచ్చినది మొదలు ఈడి విచారణ ప్రారంభమైంది. జగన్ అక్రమాస్తుల కేసులో చెంచల్‌గూడా జైలులో ఉన్న నిందితులను ఈడి విచారించింది. వీరితో పాటు జగన్‌ను విచారిస్తామని నాంపల్లిలోని సిబిఐకోర్టులో పిటీషను దాఖలు చేసింది. అయితే ఈడి రంగంలోకి దిగినది మొదలు విచారణలో తన దాకా రాకుండా జగన్ పలురకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే తన తరుపున న్యాయవాది అశోక్‌రెడ్డిని జగన్ రంగంలోకి దించారు. ఈయన జగన్ తరుపున దాఖలు చేసిన రీకౌంటర్‌లో ఈడి గురించి ప్రస్తావించిన ప్రతీ చోటా విచారణకు మాత్రం అనుమతి ఇవ్వవద్దని సిబిఐకోర్టును జగన్ కోరుతున్నారు. ఇలా కోరటంలోనే ఈడి విషయంలో తనకున్న భయాన్ని జగన్ వెల్లడిరచారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏ కేసు విచారించినా నిందితులే తాము నిర్దోషులమని ఆధారాలతో సహా చూపాలి. లేకపోతే కోర్టు ద్వారా శిక్షలు పడతాయి. ఈడి విభాగం ఏర్పడినప్పటి నుంచి ప్రతీకేసులోనూ నిందితులు సాక్షాలు చూపలేక పోతే జైలుజీవితం అనుభవిస్తున్నారు. అందువల్ల తన జీవితం జైలుకు పరిమితమవుతుందన్న భయం వల్ల కూడా జగన్ మనస్సులో ఈడి విచారణ ప్రకంపనలు సృష్తిస్తున్నాయి. ఈడిని ఆపాలని కోర్టుకు జగన్ మొరపెట్టుకున్నారు.