Read more!

కేంద్రం ఎంట్రీ... ఇక జగన్ అడ్డంగా దొరికిపోతాడు!

ఇది చాలా సీరియస్ మేటర్... ఎన్నికల సందర్భంగా హత్యాప్రయత్నం లాంటి ఇష్యూలు క్రియేట్ చేసే జగన్ లాంటి వాళ్ళకి సీరియస్ వార్నింగ్ లాంటి మేటర్. అప్పుడెప్పుడెప్పుడో కోడికత్తి డ్రామా, బాబాయి గొడ్డలిపోటు లాంటి డ్రామాలు ఆడి సింపతీ గెయిన్ చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మళ్ళీ అదేరూట్లో వెళ్ళే ప్రయత్నం చేశాడు. కొండకి వెంట్రుక వేద్దాం.. వస్తే కొండ.. పోతే వెంట్రుక అన్నట్టుగా మరోసారి ‘కోడికత్తి-2’ లాంటి డ్రామాకు తెర తీశారు. అలా డ్రామా ప్లే అవగానే ఇది హత్యా ప్రయత్నం అని సొంత మీడియా ప్రచారం ప్రారంభించింది. ఈసారి ఈ ఇష్యూ కోడికత్తి డ్రామాలాగా జగన్‌కి అనుకూలం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. మేటర్ కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విషయం జగన్ అండ్ కంపెనీకి తెలుస్తోందో లేదోగానీ... మేటర్ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక జగన్ బ్యాచ్ జరిగే పరిణామాలు చూడ్డం తప్ప మరేమీ చేయలేరు చూస్తూ వుండండి. 

ఇదేంటి.. ఇది రాష్ట్రంలో మేటర్ కదా.. కేంద్రంతో సంబంధం ఏంటి అని ఎవరైనా అంటే, వారికి అమాయక చక్రవర్తి బిరుదు ప్రదానం చేయొచ్చు. ఇప్పుడు దేశమంతా ఎన్నికల కమిషన్ చేతిలో వుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో జరిగే ఏ అంశంలో అయినా కేంద్రం సులభంగా ఎంటరైపోవచ్చు. ఆల్రెడీ జగన్ రాయి డ్రామా మీద కేంద్ర ఎన్నికల సంఘం ఆరా ప్రారంభించేసింది. ఈ ఘటన గురించి వివరాలు కోరింది. అక్కడతో ఆగకుండా ఈ విషయాన్ని ప్రధానమంత్రి పర్యటనతో లింకు కలిపింది. మొన్నీమధ్య చిలకలూరిపేటకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వచ్చినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యానికి, ఈ అంశానికి లింకు వేసింది. ‘వీఐపీల పర్యటనల సందర్భంగా భద్రతా వైఫల్యాలు’ అనే ఒకే అంశం కిందకి ఈ రెండు అంశాలను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర పోలీసుల  మీద బోలెడన్ని ప్రశ్నలను సంధించిన ఈసీ ఇప్పటికే ఐజీ, ఎస్సై మీద బదిలీ వేటు వేసింది. ఇప్పుడు జగన్ ‘షో’లో ‘భద్రతా వైఫల్యం’ విషయంలో కూడా పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం వుంది. ఇది ఇక్కడితో ఆగేట్టు లేదు. దీనిమీద ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటయింది. 20 మంది అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ల డేటా కూడా టాస్క్ ఫోర్స్ చేతికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ విచారణలో అసలు విషయాలు నిగ్గు తేలతాయి. జగన్ అండ్ కో డ్రామా బయటపడటం ఖాయం. 

జగన్‌కి గులకరాయి తగలగానే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వెంటనే ‘అర్రెర్రె’ అని ట్వీట్ చేశాడంటే అర్థం నీ మీద సానుభూతితో కాదు మిస్టర్ జగన్.. ఈ విషయంలో నేను ఎంటరైపోతున్నా అని... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు?