జగన్ కు పోలీసులు రెడ్‌కార్పెట్: సోమిరెడ్డి
posted on Sep 25, 2013 @ 3:07PM
బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్‌ను పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్థుడు జగన్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. జగన్‌కు గవర్నర్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విమర్శించారు.
పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారని, ఇలా చేస్తే సాక్షుల భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు బలహీనమతోందన్నారు. కాంగ్రెస్, జగన్, కేసీఆర్ ఒక టీం అని, అందుకే జగన్‌ను కేసీఆర్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ మంచి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని సోమిరెడ్డి తెలిపారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాహుల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక రాహుల్ ప్రధాని పదవి చేపట్టేందుకు భయపడ్డారని సోమిరెడ్ది ఎద్దేవా చేశారు.