బలప్రదర్శనలా సాగిన జగన్ ప్రయాణం
posted on Sep 25, 2013 7:47AM
16 మాసాల తరువాత జైళు నుంచి బయటికి వచ్చిన జగన్ తొలి అడుగు నుంచే తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. 23 సాయంత్రం బెయిల్ ఇస్తున్నట్టుగా కోర్టు ప్రకటించిన దగ్గరనుంచి హడావిడి ప్రాంభించిన జగన్ వర్గం నిన్న ఉదయం నుంచి మరింత హడావిడి చేసింది.
ఉదయం నుంచే చంచల్‌గూడ జైళు దగ్గర గుమికూడిన జగన్ పార్టీ కార్యకర్తలు రాజకీయ సభను తలపించారు. కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా జైళు వద్ద చేరి జగన్ రాకకోసం ఎదురు చూశారు. సాయంత్రం నాలుగంటల ప్రాంతంలో జగన్ అభిమానలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జైళు నుంచి బయటికి వచ్చారు.
జగన్ జైళు నుంచి బయటి వచ్చిన దగ్గర నుంచే మొదలైంది అసలు కథ, ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి తీసుకోక పోయిన ప్రతి కూడలిలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తే జగన్ కాన్వాయ్ ఊరేగింపులా సాగింది. సాయంత్ర వేల కావడంతో ప్రతి చోట భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రదర్శనకు అనుమతి లేకపోయినా ఎక్కడ పోలీసులు జగన్ కాన్వాయ్‌ని త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా బలప్రదర్శనకు సహకరించారు.
ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఖైరాతాబాధ్ చేరుకున్న జగన్ కాన్వాయ్ ట్రాఫిక్‌కు మరింత ఆటంకం కలింగించింది. దీంతో పంజాగుట్టలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూల మాల వేయలన్న జగన్‌ను వారించి తాజ్‌కృష్ణ మీదుగా లోటస్‌పాండ్ తరలించారు.