జగన్ వైపుకు ధర్మాన సోదరుడు?
posted on Apr 13, 2011 @ 1:56PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు తన కుటుంబ సభ్యుల నుంచే సమస్యలకు గురవుతున్నారు. ధర్మాన సోదరుడు, నర్సన్నపేట కాంగ్రెసు శాసనసభ్యుడు కష్ణదాసు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కడప ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని కృష్ణదాసు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కృష్ణ దాసు తన వైవు వస్తే ఆయన భార్య పద్మ ప్రియను శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఓదార్పు యాత్ర సందర్భంగా నర్సీపట్నంలో పద్మ ప్రియ వైయస్ జగన్‌ను కలిశారు. గత మూడు నెలలుగా ప్రియతో పాటు ఆమె కుమారుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. కృష్ణదాసుతో పాటు కాంగ్రెసు టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పలవాస కరుణాకర్ కూడా ఏప్రిల్ 27వ తేదీన వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారని చెబుతున్నారు.