జేఏసీ మహాధర్నా: కేటీఆర్ అరెస్ట్
posted on Jun 15, 2013 @ 6:28PM
తెలంగాణ జేఏసీ తలపెట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాకు అనుమతి లేదని పోలీసులు ఉదయం నుంచే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నం విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేసిన జేఏసీ నేతలు రఘు, దయాకర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విద్యుత్ సౌధ ముట్టడికి యత్నించిన టి.జేఏసీ చైర్మన్ కోదండరాం సహా, ఎమ్మెల్యేలు కేటీఆర్, నాగంను అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటికి వదిలిపెట్టారు. పోలీసులు విడిచిపెట్టగానే నేతల మరలా విద్యుత్ సౌధ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లోనికి అనుమతించాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ సౌధ ఉన్నతాధికారులతో మాట్లాడిన పోలీసులు ముగ్గురు నేతలను లోపలికి అనుమతినిచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ట్రాన్స్‌కో సీఎండి, పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన కేసు పెడతామన్నారు. ఉద్యోగులతో పెట్టుకుంటే సీఎం కిరణ్‌కు హైదరాబాద్‌లో చోటు లేదని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై పోలీసుల దమకాండ తగదని కేటీఆర్ మండిపడ్డారు.