సరదాపడింది..సరదా తీరుస్తోంది!
posted on Oct 11, 2022 @ 12:57PM
కుక్కపిల్లని పెంచుకోవడం అందరికీ సరదానే. పక్కింటివారింట్లో చూసి తాను కుక్కపిల్లని పెంచుకోవా లని మారాం చేస్తుంది మిన్నీ. అంతవరకూ బాగానే ఉంది. కానీ విదేశీ కుక్కపిల్ల కావాలంటే మాత్రం కొం చెం ఆలోచించాలి. ఎందుకంటే కుక్కపిల్లల్లో అనేకజాతులవి ఉంటాయి. అన్నీ ఎంతో ముచ్చటగా ఉం డవు. కొన్ని చాలా భయపెడుతూంటాయి కూడా. సూ యూ ఇలానే కుక్కపిల్లని తెచ్చుకుని ఇపుడు భయ పడుతోంది!
బంతి విసిరి తీసుకురమ్మని అనగానే చెవులు, తోక ఆడించుకుంటూ పరుగున వెళ్లి తేవడంలో పిల్లకి, కుక్కపిల్లకి స్నేహం కుదురుతుంది. కానీ అలా కాకుండా కుక్కే ఇదెక్కడి గోల సుఖంగా ఉండనీయదీ పిల్ల అనుకుంటే?! సరిగ్గా అదే జరిగింది సూ యూ కి. చైనా యున్నాన్ ప్రావెన్స్‌కి చెందిన ఈ అమ్మాయి కుక్క పిల్లను పెంచుకోవాలనే అనుకుంది. మంచి జాతి కుక్కపిల్లయితే బావుంటుందని ఎవరో చెప్పారు. అంతే తన ఊళ్లో కుక్కపిల్లల్ని, పక్క ఊరివాళ్లవీ పట్టించుకోలేదు. తెలిసినవారు తమ యింట్లో రెండు న్నాయి ఒకటిస్తా మన్నా లైట్ తీసుకుంది.
ఆమె తల్లిదండ్రులూ పిల్ల గోల భరించలేక ప్రత్యేకించి టిబెటన్ మాస్టిఫ్ జాతి కుక్కని తెచ్చారు. దాన్ని చూడగానే కుక్కా సింహమా అన్నట్టుంది. పిల్ల , ఇంట్లో వారూ ఆశ్చర్యపోయారు. దీన్ని సరదాగా ఆడిం చడం కంటే దాన్ని రోజూ చూడ్డానికే భయపడుతున్నారు. సింహానికి ఉన్నంత జుత్తు ఉంది. చూడ్డానికి ఏమాత్రం కుక్క లక్షణాలే లేవు. పైగా భారీ ఆకారంగా ఉండడంతో అది ప్రత్యేకించి హాల్లోనో, గదిలోనో, తోటలోనో కొంత ప్లేస్ ఆక్రమించుకుని కూచునే ఉంటుంది. పడుకున్నట్టే కనపడుతుంది కానీ అన్నీ గమనిస్తూంటుంది. బంతి కాదు.. రాయి విసిరినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక దాన్ని తెచ్చుకుని ప్రయోజనమేమిటనుకున్నారంతా.
వాస్తవానికి టిబెటన్ మాస్టిఫ్ జాతి కుక్కలు మామూలుగా ఇంట్లో పెంపకానికి పెద్దగా పనికిరావు. వాటిని సరదాగా ఆడించడం, దానితో ఆటలాడటం చాలా కష్టమన్నారు దాన్ని గురించి తెలిసినవారు. పైగా దాని వ్యవహారం అంతా వింతగా ఉంది. ఎక్కువగా బయటికి రావడానికి బయట ఆడించడానికి అది యిష్ట పడదు. వీటిలో మగ కుక్కలు 83 సెం.మీ పొడవు పెరుగుతాయి. చిన్న కుక్కపిల్లయినా చూడ్డానికి పెద్ద కుక్కలా కనపడతాయి, లొంగదీసుకోవడమూ కష్టమే. చుట్టుపక్కలవారి కుక్కలతో స్నేహంగా ఉండేట్టు యజమానే నానా తంటాలు పడి స్నేహంగా ఉండేట్టు అలవాటు చేయాలి. మరి సు యూ ఏం చేస్తుందో?!