ఏపీ ట్రెజరీ అధికారులకు ఐటీ నోటీసులు
posted on Sep 11, 2022 @ 11:00AM
టీడీఎస్ చెల్లింపుల వ్యవహారంలో ఐటీశాఖ ఏపీ ట్రెజరీ విభాగానికి నోటీసులు జారీ చేసింది. ఉద్యో గుల వేతనాల నుంచి మినహా యిస్తున్న టీడీఎస్ మొత్తాలను జమ చేయక పోవడంపై ఐటీ శాఖ వివరణ కోరినట్టు సమా చారం. ఏపీలోని ట్రెజరీ విభాగం ఉన్న తాధికారులతో పాటు అన్ని జిల్లాల ట్రెజరీ, సబ్ ట్రెజరీ అధికారులకు లేఖలు పంపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఉద్యోగులనుంచి వసూలు చేసిన టీడీఎస్ ఐటీ విభాగానికి జమ చేయక పోవటం పై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆలస్యంగా చెల్లిస్తే చట్టప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది.
మూలాధారం వద్ద పన్ను మినహాయించబడినది (టీడీఎస్) అనేది ఆదాయ ఉత్పత్తి సమయంలో నేరుగా పన్ను వసూలు చేసే ఒక వ్యవస్థ. భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, టీడీఎస్ చెల్లింపుదారు ద్వారా తీసివేయబడుతుంది మరియు అతను చెల్లింపుదారు తరపున ప్రభుత్వానికి చెల్లింపు చేస్తాడు. ఉదాహరణకు, ఉద్యోగికి జీతం చెల్లించే యజమాని టీడీఎస్‌ని తీసి వేయవలసి ఉంటుంది. దానిని ఉద్యోగి తరపున ప్రభుత్వానికి చెల్లించాలి. అదేవిధంగా, ఒక ఇంటి కొను గోలు దారు విక్రేత తరపున ప్రభుత్వానికి టీడీఎస్‌ని తగ్గించి, చెల్లించవలసి ఉంటుంది. ఐటీ చట్టాల ప్రకారం, జీతం, వడ్డీ, అద్దె, కమీ షన్, బ్రోకరేజ్ మొదలైన వాటిపై చెల్లింపుదారుడు టీడీఎస్ తీసివేయబడుతుంది.
ఏపీలోని అన్ని జిల్లాల ట్రెజరీ అధికారులు, సబ్ ట్రెజరీ అధికారులకు ఐటీ శాఖ లేఖలు పంపింది. బెజవాడలోని ఐటీ శాఖ, టీడీ ఎస్ రేంజ్ నుంచి అందరికీ తాఖీదులు పంపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల ఉద్యోగుల నుంచి టీడీఎస్ వసూలు చేశారని పేర్కొన్న ఐటీ అధికారులు టీడీఎస్ మొత్తాన్ని ఏడాది చివరి వరకు జమ చేయలేదని ఐటీ శాఖ పేర్కొన్నది.వెంటనే ప్రతినెల టీడీ ఎస్ మొత్తాన్ని చెల్లించాల్సిందేనన్న ఐటీ ఆదేశించింది. ఆలస్యంగా చెల్లిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 192(1) ప్రకారం వడ్డీ వసూలు చేస్తా మని హెచ్చరించింది. అంతేగాక అధికారులంతా ఈ నిబంధనలు పాటించాలని ఐటీ సూచించింది.