భారత అంగారక యాత్ర ప్రారంభం

 

 

 

భారత అంగారక యాత్ర ప్రారంభమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2:38గంటలకు పీఎస్ఎల్‌వీ 5రాకెట్ ను నింగిలోకి ప్రయోగించారు. 320 టన్నుల బరువు ఉపగ్రహంతో కలిపి, 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్.. దేశీయంగా రూపొందించిన 1,337 కిలోల మార్స్ ఆర్బిటర్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ప్రయోగానంతరం 44:28 నిమిషాల్లో భూ ఉపరితలానికి 383.38 కిలోమీటర్ల ఎత్తుకు చేరనుంది. పసిఫిక్ సముద్ర ఉపరితలంపై భూమధ్యరేఖకు 19.2 డిగ్రీల వాలులో ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలో మార్స్ ఉపగ్రహాన్ని విడిచిపెడుతుంది.