వైట్ ఫంగస్ అత్యంత ప్రమాదకరమా?
posted on May 22, 2021 @ 9:30AM
ఒక పక్క కరోనా వైరస్, మొన్న బ్లాక్ ఫంగస్, ఇప్పుడు వైట్ ఫంగస్ ప్రజల ను మింగేయ్య డానికి వచ్చిపడింది. వైరస్ ను కట్టడి చేయచ్చు. కానీ శరీరం లోపల పేరుకు పోయిన బూజు అదే ఫంగస్ శరీరం లోని కణ జలాన్ని తినేస్తుంది.
ఒక్కో అవయవంలోకి చెరీ న ఫంగస్ లు రెండు రకాలని ఒకటి బ్లాక్ ఫంగస్,రెండవది వైట్ ఫంగస్ అని నిపుణులు తేల్చారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వైట్ ఫంగస్ రొగులు ఉన్నారని వైద్యులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాద కరమని తేల్చారు. వైట్ ఫంగస్ ఊపిరి తిత్తులు,గోళ్ళు, చర్మం, పొట్ట, కిడ్నీ, మెదడు,నోరు , వంటి భాగాలను తీవ్ర ప్రభావం చూపుతుందనిఅంటున్నారు.
వైట్ ఫంగస్ లక్షణాలలో ఒకటి ఊపిరి తిత్తుల్లో నొప్పిగా ఉండడం లేదా పట్టినట్లు ఉండడం. ఊపిరి పీల్చు కోడం లో ఇబ్బంది పడడం. సహజంగా చాలా మందికి శరీరంలో ఇన్ఫెక్షన్ లు ఉంటూనే ఉంటాయి. ఉదాహరణకు, ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్. డయాబెటిస్ వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, కలుషిత ఆహారం తీసుకుంటే పొట్టలో ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇలా ఒకటో ఏమిటి మనశరీరం అంతా ఇన్ఫెక్షన్ల పుట్ట. ఇక దీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటున్న వారికి సుదీర్ఘ కాలం పాటు అన్నీ బెడ్ మీదే సాగే రొగులు అలాగే మంచం పై ఉంటే బెడ్ సోర్స్ వల్ల శరీరం లో పుండు ఏర్పడి ఆ భాగమ్ ఇన్ఫెక్షన్ కు గురి అయి అది ఇతర అవయవాలను చెరీ తినివేయడంవల్ల ఇన్ఫెక్షన్ తొల గించడానికి తీవ్రంగా శ్రమించాలి అయినా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కిడ్నీలో చెరీ ఇబ్బంది పెడుతుంది అలాగే సకాలంలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి ట్రీట్మెంట్ లో సరైన యాంటీ బాయిటిక్స్ ఐ వి ఇంటర్ వైన్ ఇస్తే ఇన్ఫెక్షన్ తగ్గి మనిషిని బతికించవచ్చు లేదా ఆ యిన్ఫెక్షన్ అన్నీ అవయవాలను తినేస్తే శరీరం చికిత్సకు స్పందించకుంటే చనిపోతారని వైద్య నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలం పాటు చికిత్సలౌన్న సర్జరీ చేసిన త్రువాత ఇన్ఫెక్షన్ లో చీము చెరీ చనిపోయిన వారిసంఖ్య చాలానే ఉంటుంది.
వైట్ ఫంగస్ కన్నా ఇన్ఫెక్షన్ లే ప్రాణాలను తీసేస్తాయి. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షనా కాదా కేవలం బూజు మాత్రమేనా యాంటీ బాయిటిక్స్ కు లొంగు తుందా అన్న విషయాన్ని నిపుణులు పూర్తిగా దృవీకరించాల్సి ఉంది. ఏది ఏమైనా ఫంగస్ ప్రాణాంతకం అని చెపుతున్నారు డాక్టర్స్. సొ జరబధ్రం మరి.