ఉక్కు మహిళ షర్మీళ కొత్త పార్టీ వచ్చేసింది..
posted on Oct 18, 2016 @ 3:48PM
సైనిక దళాల ప్రత్యేక అధికారాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిల 16 సంవత్సరాలుగా ఆమరణ నిరాహారదీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాల నుండి దీక్ష చేస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇటీవలే ఆమె దీక్ష విరమించిన సంగతి కూడా విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని.. వచ్చే ఏడాది ఎన్నికల్లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దానిపేరు 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'. వచ్చే సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఈ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా ఒక మార్పును తీసుకొస్తామని, ఏఎఫ్ఎస్‌పీఏ లాంటి చట్టాలు ఇకమీదట సామాన్యులను ఇబ్బంది పెట్టలేవని పార్టీ ప్రకటన సందర్భంగా ఆమె అన్నారు. మరి ఆమె ఎంతవరకూ విజయం సాధిస్తారో చూద్దాం..