ఐపీఎల్-4.. ధోనీ వర్సెస్ గంభీర్
posted on Apr 8, 2011 @ 4:42PM
చెన్నై: ఈరోజు చెన్నై లోని చెపాక్ స్టేడియంలో భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్నటువంటి ఐపిఎల్ ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడనున్నారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై.. ధోనీ, రైనా, విజయ్, అశ్విన్, బద్రీనాథ్, అనిరుద్ధ.. అల్బీ మోర్కెల్, మైక్ హసి, బొలింజర్ లాంటి పాత ఆటగాళ్లనే నమ్ముకుని బరిలోకి దిగుతుంటే.. కోల్‌కత మాత్రం దాదాపుగా కొత్త జట్టుతో లీగ్‌లో అడుగుపెడుతోంది. ఫైనల్లో కలిసి పోరాడి, భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీ, గంభీర్‌లు.. ఎవరికి వారుగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు తొలి పోరులో ఢీకొట్టనున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ప్రారంభానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆడిపాడనున్నారు. ఐపీఎల్ గీతానికి కింగ్ ఖాన్ స్టెప్పులేయనున్నాడు.
కాగా, ఐపిఎల్ 4వ సీజన్‌లో బిసిసిఐ బిజిగా ఉంది. ఐపిఎల్ 3 జరిగినప్పుడు బిసిసిఐకి కేవలం రూ 450-500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. కానీ ఈసారి ఐపిఎల్ లోకి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడం వల్ల దీని ఆదాయం డబుల్ అయింది. అంటే ఐపిఎల్ 4వల్ల బిసిసిఐకి వచ్చిన లాభం రూ 900కోట్లు. బిసిసిఐ ఆఫీసియల్ కధనం ప్రకారం ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ లోకి కొత్తగా వచ్చినటువంటి పూణే వారియర్స్, కొచ్చి టీమ్‌లను ప్రాంచైజీలు రూ 3, 235కోట్లకు కొనడం జరిగింది. ఇక బిసిసిఐ మూడు సంవత్సరాలకు కలిపి మీడియా రైట్స్‌ని నింబస్ టెలివిజన్‌కు గాను రూ 260కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక బ్రాడ్ కాస్టింగ్ రైట్స్, సెంట్రల్ స్పాన్సరింగ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుని పది టీమ్‌లు సమానంగా పంచుకుంటాయి. ఇందులో బిసిసిఐ 20శాతం వాటాని అడిగింది. ఇదిమాత్రమే కాకుండా బిసిసిఐకి మల్టీ స్క్రీన్ మీడియా, సెట్ మాక్స్ టెలివిజన్ సంస్ద దాదాపు రూ 420కోట్లు చెల్లించి బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ తీసుకుంది.