ఢిల్లీలో హైఅలర్ట్.. ఉగ్రవాదులు చొరబడ్డారు..
posted on Oct 8, 2016 @ 3:00PM
దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్థాన్ కేవలం 10 రోజుల్లోనే 25సార్లు కాల్పులకు తెగబడింది. అయితే అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారి కాల్పులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటలిజెన్స్ వర్గాలు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని.. ఆత్మాహుతి దాడి చేసేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని హోల్ సేల్ మార్కెట్ కి యాపిల్ పళ్లు తరలిస్తున్న కమర్షియల్ వాహనంలో వీరిద్దరూ నగరంలోకి ప్రవేశించారని.. వీరిద్దరూ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారని తెలిపాయి. దీంతో, ఢిల్లీలో హైలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో సంచరించే వారు జాగ్రత్తగా ఉండాలని.. రైళ్లు, బస్సుల్లో వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలోని టోల్ ప్లాజాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఛాందీ చౌక్, పహార్ గంజ్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కొన్ని రోజుల పాటు ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు.