ఛత్రీని అగౌరవపర్చడం సబబా?
posted on Sep 19, 2022 @ 2:45PM
ఏ వృత్తిలో ఉన్నా ఇతరులను గౌరవించడం మనకే మర్యాద. చాలామంది ఉన్నతోద్యోగులు, రాజకీయ నాయకులకు క్రీడాకారులమీద పెద్దగా గౌరవం ఉండదు. మరీ అంతర్జాతీయస్థాయిలో రాణించేవారు, వారికి కాస్తంత సన్నిహితంగా ఉండేవారో, వారి ప్రాంతానికి చెందినవారికో అయితే తప్ప పెద్దగా పట్టించు కోరు. రాజకీయ నాయకులకు వారి సీఎంలు, ఎంపీలే ముఖ్యం. అందుకే సునీల్ ఛత్రి వంటి గొప్ప క్రీడాకారుడికి లభించే గౌరవానికి కూడా అడ్డుతగలడం చాలా దారుణం.
ఆదివారం(ఆగస్టు 18)న కోల్‌కతాలో బంగళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సి ల మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. 40వేలమంది ప్రేక్షకుల సమక్షంలో బ్రహ్మాండంగా జరిగిన ఆ మ్యాచ్‌లో సునీల్ ఛత్రి నాయక త్వం లోని బెంగళూరు జట్టు పై 2-1 స్కోరు తేడాతో గెలిచింది. మ్యాచ్ తర్వాత ట్రీఫీని విజేతకు బహుక రించే కార్య్రకమం జరిగింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గణేశన్ విజేతకు ట్రోఫీ బహూకరించాలి. కానీ బెం గుళూరు కెప్టెన్ ఛత్రీ స్టీజీ మీదకి వచ్చి ట్రోఫీని అందుకోబోతుంటే గవర్నర్ అతన్ని పక్కకు నెట్టారు. ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఛత్రీ కాస్తంత పక్కకు జరగాల్సి వచ్చింది! గవర్నర్‌తో పాటు ఫోటో తీయిం చుకోవాలన్న ఆతృతతో ఒక రాజకీయనాయకుడు ముందుకు వచ్చేశాడు.
ఫైనల్ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టుకు అద్భుతంగా తొలి గోల్ చేసి జట్టు దూసుకువెళ్లడానికి తోడ్పడిన శివ శక్తి నారాయాణన్ ను స్టేజీ మీదకి పిలిచారు. కానీ అతన్ని కూడా పట్టించుకోలేదు. విజేత జట్టుకు సంబం ధించిన ప్లేయర్లను స్టేజీమీదకి పిలిచి మరీ ఇలా అవమానించడం ఎంతవరకూ సబబు అని పించుకుంటుంది? ఈ ప్రశ్ననే తర్వాత ట్రోఫీ నిర్వాహకులను చాలామంది ప్రశ్నించారు. ఎందు కంటే దేశంలో ఫుట్బాల్ అనగానే వినపడే గొప్ప ప్లేయర్ ఛత్రీ. అలాంటి ప్రొఫేషనల్‌ను గౌరవించడం చాతకా నప్పుడు తెలియనట్టే ఉండాలి. క్రికెట్కు సచిన్ ఎలాగో, బ్యాడ్మింటన్‌కు సింధు ఎలాగో, ఫుట్ బాల్‌కి ఛత్రీ అలాగ. కానీ సచిన్‌కి లభించే గౌరవం ఇతర క్రీడలకు సంబంధించిన ప్రముఖ క్రీడాకా రులకు లభించకపోవడం దురదృష్టం.
ఛత్రీని అవమానించడం దేశంలో ఫుట్‌బాల్‌ని అగౌరవ పర్చడమేనని మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గొప్పక్రీడాకారుల కంటే రాజకీయనాయకుల ఫోటో ఆరాటం ఎక్కువయిందని వ్యాఖ్యా నించారు. బెంగళూరు ఎఫ్.సీ 131వ సారి డూరాండ్ కప్ ఫైనల్లో గెలిచింది. అందుకు ముఖ్యంగా ఎన్. శివ శక్తి, అలెన్ కోస్టా వంటివారు తమ అనుభవాన్నంతా ప్రదర్శిస్తూ ఆడిన తీరు మహాద్భుతమని ఫుట్ బాల్ వీరాభిమానులు అంటున్నారు. ఏమయినప్పటికీ, క్రీడాకారులను అగౌరవపర్చడం మాత్రం ఎవ్వరి కీ హర్షణీయం కాదు. దీన్ని గురించి అన్ని క్రీడల్లోని ప్రముఖులు నిరసననే వ్యక్తం చేస్తున్నారు.