విద్యుత్‌కోతలపై పారిశ్రామిక వేత్తల ఆగ్రహం
posted on Aug 20, 2012 @ 12:02PM
ఇటీవల పెరిగిన విద్యుత్ కోతలకు ఇప్పటికే కుదేలయిన పారిశ్రామిక వేత్తలు కోలుకోలేని దెబ్బతింటున్నామన్నారు. ముందు చూపు లేకుండా ప్రభుత్వం తమను ఆర్ధికంగా దెబ్బతీసిందని వారు వాపోతున్నారు.హైదరాబాద్ నగర శివార్లలోని పారిశ్రామిక వాడలో ఎడతెరిపిలేకుండా అమలవుతున్న కరెంటు కోతలకు పారిశ్రామిక వేత్తలు,కార్మికులు కళ్లెర్ర చేశారు.ఇప్పటికే చిన్న పరిశ్రమలను మూసుకున్నారని ఇకపై పెద్ద పరిశ్రమలు కూడా అదే బాటన పడుతున్నాయంటున్నారు. కరెంటు సబ్సిడీపై ఆశలు పెట్టుకొని పరిశ్రమలు ప్రారంభించిన వారంతా ఇప్పుడు దారుణంగా మోసపోయారని అంటున్నారు.ప్రభుత్వ పని తీరుతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంతకు ముందు తెలుగుదేశం హయాంలోకూడా ఇదే జరిగితే తర్వాతి ఎన్నికల్లో వారు ఓడి పోయారని ప్రజలు చెబుతున్నారు. అంతులేని గ్యాసు నిల్వలు మన రాష్ట్రంలోనే ఉన్నా అసమర్ధ ప్రభుత్వం వల్ల పరిశ్రమలు ఖాయిలా పడి కార్మికులు వీధిన పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.