దారుణంగా ఆడి దక్షిణాఫ్రికాను గెలిపించిన భారత్
posted on Oct 30, 2022 @ 9:14PM
గత రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆటను ప్రదర్శించి విజయాలు సాధించిన భారత్ మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడింది. ఊహించని ఫీల్డింగ్ లోపాలు, అశ్విన్ వంటి సీనియర్ స్పిన్నర్ విఫలం కావడంతో పాటు సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, రాహుల్, కింగ్ కోహ్లీ వైఫల్యం జట్టు ఓటమి బాటే పట్టించింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే కష్టపడి 68 పరుగులు చేశాడు. భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని 20 ఓవర్లలో కేవలం 133 పరుగులే చేసింది. దక్షిణా ఫ్రికా పేసర్లు ఎన్గిడి, పార్నల్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించడంలో తమ సత్తా చాటా రు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎన్గిడి తన 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీసు కోగా, పార్నల్ 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసు కున్నాడు. దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 137 పరుగలు చేసిం ది. మిల్లర్, మార్కరమ్ భారత్ బౌలర్ల భరతం పట్టించారు.
ఆదివారం పెర్త్‌లో గ్రూప్ 2 సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ గత రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో మ్యాచ్ కూడా విజయం సాధిస్తుం దని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ భారత్ బ్యాటింగ్ ఆరంభం నుంచే ఖంగారు పడ్డారు. పవర్ ప్లే 6 ఓవర్లలో భారత్ 33 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. తర్వాతి ఓవర్లోనే కోహ్లీ కూడా వెనుదిరగడంతో ప్రేక్షకులు ఎంతో నిరశపడ్డారు. రెండో మ్యాచ్ లో ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన కింగ్ ఈ మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే వెనుదిరిగాడు. కుర్రాడు హూడా ఈ మ్యాచ్ లో నిలబడతాడని కెప్టెన్ ఆశపడ్డాడు. కానీ అతనూ బోర్లాపడ్డాడు. ఆ తర్వాత హార్డిక్ పాండ్యా మెరుపులు ప్రదర్శించ కుండానే సర్దు కున్నాడు. దీంతో భారత్ 10 ఓవర్లకి కేవలం 60 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కానీ మరో ఎండ్‌లో సూర్య ఇన్నింగ్స్ నిలిపే యత్నంలో చాలా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్‌ను పెంచుతూపోయాడు. 15 ఓవర్లో సూర్య తన అర్ధసెంచరీ పూర్తి చేశాడు. సూర్య 50 పరుగులు 30 బంతుల్లో కొట్టాడు. అందులో 3ఫోర్లు, 3 సిక్స్‌లూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత అదే ధాటిని కొనసాగించ లేకపోయాడు. భారత్ వందపరుగులు 16వ ఓవర్లో పూర్తయ్యాయి. అ్పుడే సూర్య అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కార్తిక్ కూడా వెనుదిరగడంతో భారత్ పెద్దగా స్కోర్ చేయ దన్నది స్పష్టమయింది. మొత్తానికి భారత్ 20 ఓవర్లకి 9 వికెట్ల నష్టానికి 133 పరు గులు అతి కష్టం మీద చేయగలిగింది.
134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా ఓపనర్లకు భారత్ యువ పేసర్ అర్ష్‌దీప్ పెద్ద పరీక్షే పెట్టాడు. ఈ లెఫ్టీ వస్తూనే 2వ ఓవర్లో డీకాక్‌ను వెనక్కి పంపాడు. ఇంతకు ముందు మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాట్ చేసిన రూసో కూడా అతనికే దొరికిపోయాడు. అప్పుడు వచ్చాడు మార్కరమ్. అతను ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్‌ను వేగంగా పెంచడంలో భారత్ బౌలర్లం దరికీ పెద్ద పరీక్షగా మారాడు. దీనికి తోడు ఫీల్డింగ్ లోపాలన్నీ బయటపడ్డాయి. రెండు స్టంపింగ్‌లు, రెండు లడ్డులాంటి క్యాచ్‌లూ చేజారడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు మరింత జాగ్రత్తపడి బ్యాట్ చేశారు. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేశారు. 12వ ఓవర్లో అశ్విన్ బంతిని ఫోర్ కొట్టే యత్నంలో మార్కరమ్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కానీ కోహ్లీ చేతిలోంచి క్యాచ్ మిస్ అయింది. మొత్తం ప్రేక్షకులు కెప్టెన్‌తో పాటు నోరెళ్లబెట్టారు. కోహ్లీ కే అర్ధం కాని పరిస్తితి. అప్పటి నుంచి దూకుడుగా ఆడటం మరింత కొనసాగించారు. ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ అశ్విన్‌ని సిక్స్‌లు, ఫోర్లు కొట్టడంతో లక్ష్య సాధన మరింత సులువయింది. 14వ ఓవర్లో అశ్విన్ ఏకంగా 17 పరుగులిచ్చాడు. మార్‌క్రమ్ 38 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు.
16వ ఓవర్లో దక్షిణాఫ్రికా వంద పరుగులూ పూర్తయ్యాయి. ఈ సమయంలో గాయం కారణంగా కీపర్ కార్తిక్ వెళిపోగా అతని స్థానంలో రిషబ్ పంత్ వచ్చాడు. తర్వాతి ఓవర్లో మార్కక్రమ్ సూర్యకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. కానీ మరో వంక డేవిడ్ మిల్లర్ ఎంతో ధాటిగా దంచికొట్టాడు. ఒక్క షమ్మీ తప్ప అశ్విన్, పాండ్యాలను ఇద్దరి నుంచి పరుగులు సాధించాడు. 18 వ ఓవర్‌కి 102 పరుగులు చేసింది. ఈ ఓవర్ అశ్విన్ కి ఇచ్చి శర్మ తప్పు చేశాడనాలి. ఆ ఒక్క ఓవర్లోనే వీర బాదుడు బాది ఏకంగా 25 పరుగులు సాధించడంతో ప్రేక్షకులు ఇక ఇంటికి వెళ్లడమే మిగిలిందని అనుకున్నారు. అలా దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ 2లో మొదటి స్థానంలో నిలిచింది.