ఐదుగురు భారతీయులను సజీవ సమాధి
posted on Mar 1, 2014 @ 10:04AM
సౌదీలో ఐదుగురు భారతీయులను సజీవ సమాధి చేసారు. ఇది ఘోరం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పొట్టకూటి కోసం సౌదీకి వెళ్ళిన ఈ ఐదుగురు భారతీయ కార్మికులను అక్కడి వారు చిత్రహింసలు పెట్టి మరీ చంపేసారట. ఈ హత్య కేసులో సౌదీ పోలీసులు దాదాపు 25మందిని అరెస్టు చేయగా..2010లో ఈ నేరం చేసినట్లుగా ముగ్గురు నిందితులు కోర్టులో అంగీకరించారు. కోర్టులో వారు చెప్పిన విషయమేమిటంటే... స్నేహితుడి సమాచారం మేరకు ఓ రోజు రాత్రి ఫ్రెండ్ ఫాంకి వెళ్లానని ఓ వ్యక్తి చెప్పాడు. అయితే అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తుల చేతులు కట్టేసి, అక్కడే ఉన్న ఓ యజమాని కూతురు, మరో మహిళను లైంగికంగా వేధించాడని తన స్నేహితుడు తనకు చెప్పినట్లుగా తెలిపాడు. అంతే కాకుండా మద్యం తాగిన తర్వాత భారతీయులను ఓ గదిలో బంధించి తీవ్రంగా కొట్టామని, ఆ తర్వాత వారిని తాళ్ళతో కట్టేసి, ట్రక్ లో తరలించి, ఫాంలో 2.5 మీటర్ల లోతున గొయ్యి తవ్వి, బ్రతికుండగానే వారిని, వారితో పాటు గుర్తింపు కార్డులను కూడా అందులో పూడ్చేసినట్లు తెలిపాడు. అయితే ఈ విషయంపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించి... బయటపడిన శవాల ఎముకలకు డీఎన్ఏ పరిక్షలు నిర్వహించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని, అసలు అవి భారతీయులవో కాదో అనే విషయం తెలియనుందని అన్నారు.