టీవి నటి పై అత్యాచారం, పదేళ్లు శిక్ష
posted on Apr 18, 2013 @ 3:24PM
బ్రిటన్ లో టీవి నటి పై అత్యాచారం చేసిన కేసులో ఓ బారతీయ విద్యార్ధికి బ్రిటన్ కోర్ట్ పదేళ్ళ జైలు శిక్ష విదించింది. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న టీవి నటి మద్యం సేవించి హోటల్ గదిలో నిద్రిస్తుండగా అత్యాచారానికి గురైంది. తాను మద్యం మత్తులో నిద్రిస్తుండగా తనపై జాన్ సోబి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె లండన్ పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె పిర్యాదు మేరకు కోర్ట్ విచారణకు ఆదేశించింది. టెలివిజన్ స్టార్ పై అత్యాచారం చేసినట్లు జాన్ సోబి విచారణంలో అంగీకరించాడు. హోటల్ సిబ్బంది సహాయంతో ఆమె గదిలోకి ప్రవేశించిన జాన్ మద్యం మత్తులో వున్న నటి పై అత్యాచారం జరిపినట్లు కోర్ట్ కి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అతనికి పదేళ్లు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత సోబీ జాన్‌ను భారతదేశానికి పంపించనున్నట్లు బ్రిటిష్ టాబ్లాయిడ్ 'ది సన్' రాసింది.