భారత మహిళా హాకీ జట్టును అవమానించిన భారతీయ రైల్వే..
posted on Aug 28, 2016 @ 12:34PM
రియో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టు గతంతో పోలీస్తే మెరుగైన ప్రదర్శన చేయడంతో రానున్న టోక్యో ఒలింపిక్స్‌లో మరింత బాగా రాణించడానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మహిళా హాకీ జట్టుకు తీరని అవమానం జరిగింది. అది ఎక్కడో కాదు మన దేశంలోనే..సాక్షాత్తూ భారతీయ రైల్వేల చేతిలోనే. రియో నుంచి తిరుగు పయనమైన జట్టులోని కొందరు సభ్యులను భారతీయ రైల్వేలకు చెందిన ఓ టీటీ రైల్లో కింద కూర్చోబెట్టాడు. ఒలింపిక్స్ ముగియగానే రియో నుంచి తిరుగు పయనమైన మహిళా హాకీ జట్టులోని కొందరు సభ్యులు..రాంచీ నుంచి రూర్కెలా వెళ్లేందుకు బోకారో-అలెప్పీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. అయితే వారి ప్రయాణానికి సంబంధించి ముందస్తు రిజర్వేషన్లు లేవు. దీంతో వారిని కింద కూర్చోవాలంటూ టీటీ ఆదేశాలు జారీ చేశారంటూ జాతీయ ఛానల్ సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రసారం చేసిన కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.