టి20 సీరీస్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా
posted on Feb 14, 2016 @ 9:05PM
శ్రీలంకతో జరుగుతున్న టి20 సీరీస్ ను ఇండియా 2-1తో సొంతం చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మూడో టి 20లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ధోనీ శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ కేవలం 82 పరుగులకే చాప చుట్టేసింది. లంక బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు దాటగలిగారంటే, ఇండియా బౌలింగ్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీలంక ఇన్నింగ్స్ లో శానక 19 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశ్విన్ బౌలింగ్ లో రాణించి 8 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. తొలిఓవర్లోనే అశ్విన్ రెండు వికెట్లు తీయడం విశేషం..
బ్యాటింగ్ లో ఇండియా పెద్దగా ఇబ్బంది పడలేదు. శ్రీలంక బౌలింగ్ లో ఒకటి రెండు సార్లు తప్ప పిచ్ నుంచి సహకారం లభించకపోవడంతో శ్రీలంక బౌలర్లందరూ విఫలమయ్యారు. శిఖర్ ధావన్ 46 ( నాటౌట్ 46 బంతుల్లో ), అజ్యింక రహానే 22( నాటౌట్ 24), రోహిత్ శర్మ 13(13 బంతుల్లో) రాణించారు. ఈ మ్యాచ్ లో టీం ఇండియా తురుపుముక్కగా మారిన అశ్విన్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.